ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

ABN, First Publish Date - 2021-07-08T06:28:22+05:30

ఓ నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదు రుచూస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు

- వైద్యానికి రూ. 16 కోట్లు ఖర్చు

- ఆదుకోవాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు

మెట్‌పల్లి రూరల్‌, జూలై 7: ఓ నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదు రుచూస్తోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం లోని కొండ్రికర్ల గ్రామానికి చెందిన ఎర్ర వినోద్‌కుమా ర్‌-విజయలక్ష్మి దంపతుల కు  వశిష్ట అనే 15నెలల కుమారుడు ఉన్నాడు. బా లుడు స్పైనల్‌ మస్కులర్‌ అట్రోపీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా డు. ఈ వ్యాధి కారణంగా శరీరంలో ప్రోటీన్లు ఉత్పత్తి చేసే జన్యువు లోపం ఏర్పడింది. దీంతో కండరా లు పనిచేయడం లేదు. మెదడుకు వెళ్లే నరాలు సక్రమంగా పనిచే యకపోవడంతో నిర్జీవంగా తయారయ్యాడు. స్థోమత లేకపోయినా అప్పు సప్పు చేసి ప్రత్యేక వైద్య నిపుణులను సంప్రదించారు. వ్యాధికి చికిత్స కేవలం అమెరికాలోనే సాధ్యమవుతుందని హైదరాబాద్‌లోని రేయిన్‌బో చిల్డ్రన్‌ వైద్యులు తెలిపారు. బాలుడు బతకాలంటే చికిత్సకు రూ.16 కోట్లు అవసరం అవుతాయని సలహా ఇచ్చారు. గతంలో ఇలాంటి చికిత్స కోసం పీఎం, సీఎంలు ఇచ్చిన ప్రత్యేక లేఖలతో ఉచితంగా చికిత్సపొందిన సందర్భాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో బాలుడి తండ్రి వినోద్‌ కుమార్‌ రేయిన్‌బో వైద్యులు ఇచ్చిన సూచనలతో అమెరికాలో చికిత్స చే యించేందుకు  లైసెన్సును పొందాడు. ఇప్పటికే చికిత్సకు నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు. బాలుడు బతకా లంటే ఖరీదైన వైద్యం అవసరం అవుతుందని డాక్టర్లు తెలిపారు. అంత స్థోమత లేదని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు అభయమిచ్చేందుకు సహకరించాలని నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు.


Updated Date - 2021-07-08T06:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising