ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూకు స్వచ్ఛంద సహకారం

ABN, First Publish Date - 2021-04-22T06:34:54+05:30

కరోనా వైరస్‌ అరికట్టడానికి కర్ఫ్యూకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తమవంతు సహకారం అందిస్తుండటం ప్రజల్లో వచ్చిన చైత న్యానికి నిదర్శనమని కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కర్ఫ్యూ అమలును పరిశీలిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనం 

సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 21 : కరోనా వైరస్‌ అరికట్టడానికి కర్ఫ్యూకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తమవంతు సహకారం అందిస్తుండటం ప్రజల్లో వచ్చిన చైత న్యానికి నిదర్శనమని కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఇళ్లలోకి చేరుకునేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన వారు ఒక గంట ముందుగానే ఆయా సంస్థలు, దుకాణా లను మూసివేయడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు మాస్క్‌లు ధరించటం, సామాజికదూరాన్ని పాటించడం, తరచుగా చేతులను శుభ్రం పరుచుకోవటం, అత్యవసరం ఉంటేనే బయటకు వచ్చే విధంగా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. సినిమా థియేటర్‌ నిర్వాహకులు మే 1వ తేదీ వరకు మూసివేస్తున్నామని హామీ ఇచ్చారని తెలిపారు.  


 కర్ఫ్యూను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌


రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న తీరు ను పరిశీలించేందుకు పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఏదైనా అత్యవసర ఇబ్బందులు, ఆపద వచ్చిన సందర్భంలో నేరుగా డయల్‌ 100కు కాల్‌ చేయాలని ఈ సందర్భంగా సీపీ కోరారు. డయల్‌ 100 కు కాల్‌రాగానే నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకుని సేవలను అంది స్తారని పేర్కొన్నారు. కర్ఫ్యూ అమలుతీరును పరిశీలించేందుకు చేసిన తనిఖీలలో పోలీస్‌ కమిషనర్‌తోపాటు అడిషనల్‌ డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, ఏఎస్‌పీ రితిరాజ్‌, ఏసీపీలతోపాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T06:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising