ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి

ABN, First Publish Date - 2021-08-14T06:33:33+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేములవాడకు తరలివచ్చారు.

రాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అమ్మవారికి శ్రావణమాస పూజలు

వేములవాడ, ఆగస్టు 13 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని, రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.   శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు చతుష్టష్టి ఉపచారములతో విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఛాయనక్త సమయాన  మహాలక్ష్మీ దేవాలయంలో అమ్మవారికి షోడషోపచార పూజలు చేశారు.  మహాలక్ష్మీ అమ్మవారిని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.  

Updated Date - 2021-08-14T06:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising