ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2021-07-30T05:23:41+05:30

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జూపాక శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌

కోల్‌సిటీటౌన్‌, జూలై 29: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం గోదావరిఖని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో పీడీఎస్‌యూ, పీవై ఎల్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న జూపాక శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువుల కోసం యువత ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల లబ్ధి కోసం 50వేల ఉద్యోగాల నోటిఫికేష్‌ ఇస్తానని కేసీఆర్‌ గొప్పగా ప్రకటించాడు కానీ రెండు లక్షల పోస్టుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ విద్యార్థులకు, యువతకు వాగ్దానాలు ఇచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా ఎందుకు అమలు చేయలేదని, నిరుద్యోగ భృతి ఏదని ప్రశ్నించారు. విద్యను వ్యాపా రం చేసుకోమని ఫీజులు వసూలు వసూలు చేసుకోమని స్వ యంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించినా శ్రీచైతన్య, నారాయణ సంస్థల దోపిడీని అరికట్టడం లేదన్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ద్యోగ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. శ్రీచైతన్య, నారాయణ ఫీజుల దోపిడీ అరికట్టాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్‌ జిల్లా ఉపాధ్యక్షులు బీ శ్రీధర్‌, తిగుట్ల మనోహర్‌, ప్రసన్న, ప్రణిత్‌, హన్మేష్‌, రాఘవాచారి, వెంకటేష్‌, శ్రీనివాస్‌ తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising