ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 నెలల్లో టీఆర్‌ఎస్‌ గల్లంతు...

ABN, First Publish Date - 2021-08-26T05:18:46+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 20 ఏళ్లు టీఆర్‌ఎస్‌ పార్టీదే అధికారమని పగటి కలలు కంటున్నారని, హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు సంభవించి 20 నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గల్లంతు అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అమరుల ఆశయ సాధనకే ప్రజా సంగ్రామ యాత్ర

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

సుభాష్‌నగర్‌, ఆగస్టు 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 20 ఏళ్లు టీఆర్‌ఎస్‌ పార్టీదే  అధికారమని పగటి కలలు కంటున్నారని, హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు సంభవించి 20 నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గల్లంతు అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఆవిర్భవించిందని తెలిపారు. అమరుల ఆశయ సాధన, కుటుంబ పరిపాలనతో గడీలో బంది అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 28న ఉదయం 9:30 గంటలకు చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రజా సంగ్రామ యాత్ర  ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజా సంగ్రాయ యాత్రను విజయవంతం చేయడానికి పార్టీనాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.   కార్యక్రమంలో మాజీ మేయర్‌ డి శంకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్‌, కళ్లెం వాసుదేవరెడ్డి, గుర్రాల వెంకట్‌రెడ్డి, బొంతల కళ్యాణ్‌చంద్ర, అన్నాడి రాజిరెడ్డి, మర్రి సతీశ్‌, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, బండ రమణారెడ్డి, రాపర్తి విజయ, పెద్దపల్లి జితేందర్‌, కొలగాని శ్రీనివాస్‌, కచ్చు రవి, కాసర్ల ఆనంద్‌, అనూప్‌ కుమార్‌, నక్క పద్మ, కటకం లోకేశ్‌, మాడుగుల ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-26T05:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising