ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ బదిలీ

ABN, First Publish Date - 2021-07-28T06:00:33+05:30

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ బదిలీఅయ్యారు.

సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కరీంనగర్‌ సీపీగా పోస్టింగ్‌ 

- కొత్తగా రమణకుమార్‌ నియామకం

కోల్‌సిటీ, జూలై 27: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ బదిలీఅయ్యారు. ఆయనను కరీంనగర్‌ పోలీస్‌కమిషనర్‌ గా నియమిస్తూ మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో ఏసీబీలో జాయింట్‌డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం రమణ కుమార్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. రమణకుమార్‌ నాన్‌క్యాడర్‌ ఎస్‌పీ. గతంలో మంచిర్యాల సీఐగా, డీఎస్‌పీగా పనిచేశారు. 1991 బ్యాచ్‌కు చెందిన రమణకుమార్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావాసి. రామగుండంలో సత్యనారాయణ రెండు సంవత్సరాల పది నెలల పాటు కమిషనర్‌గా పని చేశారు. 2018 సెప్టెంబర్‌ 26వ తేదిన రామగుండం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండేళ్ల పది నెలల పాటు పనిచేశారు. 

రామగుండంలో చెరగని ముద్ర

రామగుండం సీపీగా సత్యనారాయణ తనకంటు ప్రత్యేకతను చాటుకున్నారు. రెండు సంవత్సరాల పది నెలల పాటు కమిషనర్‌గా పనిచేసిన ఆయన అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపా రు. గుండాలు, రౌడీలు, భూకబ్జాదారులు, అక్రమ ఫైనాన్స్‌లు, బొగ్గు దొంగలు, నకిలీ విత్తనాల వ్యాపారులు, ఉద్యోగాలు పెట్టిస్తామనిమోసం చేసేవారు, రేషన్‌ బియ్యం దందాకు పాల్పడేవారు, అక్రమ కలపవ్యాపారులు, గంజాయివ్యాపారులు, పేకాట, మట్కా నిర్వాహకులపై పీడీ యాక్టులు నమోదు చేశారు. కోల్‌బెల్ట్‌లో యువత తప్పుదారి పట్టకుండా ఆయన నిర్వహించిన ఆపరేషన్‌ చబుద్ర సత్ఫలితాలనిచ్చింది. 

Updated Date - 2021-07-28T06:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising