ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసులపల్లిలో పెద్దపులి ఆనవాళ్లు

ABN, First Publish Date - 2021-02-27T04:50:53+05:30

పెద్దపల్లి జిల్లా కాసులప ల్లి గ్రామ శివారులో ఎస్సారెస్పీ కాలువ సమీపంలో పొలాల వద్దకు ఉదయం వెళ్లిన రైతులు పెద్దపులిని రైతులు బెంబే లెత్తి పోయారు.

పులి ఆనవాళ్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి ఎస్‌ఐ రాజేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, ఫిబ్రవరి 26: పెద్దపల్లి జిల్లా కాసులప ల్లి గ్రామ శివారులో ఎస్సారెస్పీ కాలువ సమీపంలో పొలాల వద్దకు ఉదయం వెళ్లిన రైతులు పెద్దపులిని రైతులు బెంబే లెత్తి పోయారు. పంటలను అడవి పందుల బారి నుంచి రక్షించుకునేందుకు పొలాల చుట్టూ రైతులు బిగించిన ఉచ్చుకు పులి చిక్కుకుందని, దాని నుంచి బయట పడి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని వెళ్లినట్లు ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన కచ్చు లచ్చయ్య తెలిపారు. ఇక్కడికి పులి వచ్చిన సమాచారాన్ని ఆయన గ్రామ సర్పంచ్‌కు అటవీ శాఖాధికారులు, పోలీస్‌ శాఖాధికారులకు చెప్పడంతో వాళ్లు గ్రామాన్ని సందర్శించారు. పొలాల వద్దకు పులి వచ్చినట్లుగా, దాని అడుగులను బట్టి గుర్తించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అది ఎటువైపు వెళ్లిందనే విష యం తెలియడం లేదు. ఎలుకలు, ఉడుతలు కొరికిన చిన్న చిన్న జీవరాశుల ఆనవాళ్లను అటవీ శాఖాధికారులు, పెద్ద పల్లి ఎస్‌ఐ రాజేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ దాసరి చంద్రా రెడ్డి గుర్తు పట్టారు.  

Updated Date - 2021-02-27T04:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising