ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2021-08-01T05:32:42+05:30

పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

భవనాలను పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి కొప్పుల ఈశ్వర్‌

గోదావరిఖని, జూలై 31: పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్‌, స్కూప్‌ ఇన్స్‌టేక్‌ బాధ్యులు వేణు సంగాని సంయుక్తంగా విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా కుట్టుశిక్షణ పూర్తిచేసుకున్న 37వ డివిజన్‌ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ నేతృత్వంలో విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా మహిళల సాధికారత కేంద్రాలను ఏర్పాటుచేసి వందలా ది మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాలు చూపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో మహిళలకు స్వయంఉపాధి కల్పన కోసం విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఎస్‌సీ కార్పొరేషన్‌ ద్వారా 500 పేద ఎస్‌ సీ మహిళలకు కుట్టుమిషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా శిక్షణా తరగతు లు నిర్వహించి సర్టిఫికెట్లతో పాటు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చే స్తోందన్నారు. వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంలో తగిన స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, సూఫ్‌ ఇన్ఫోటెక్‌ బాధ్యులు వెంకట్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్‌, పా ముకుంట్ల భాస్కర్‌, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T05:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising