ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-10-27T06:25:32+05:30

మధ్యాహ్న భోజ న కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైసల్‌యం చెందిందని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు తాడూరి శ్రీమన్నా రాయణ ఆరోపించారు.

మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీమాన్‌ 

పెద్దపల్లి కల్చరల్‌/పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 26 : మధ్యాహ్న భోజ న కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు తాడూరి శ్రీమన్నా రాయణ ఆరోపించారు. మంగళవారం జిల్లా అమరవీరుల స్తూపం వద్ద తమ సమస్యల పరిష్కారానికి గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల శిబిరాన్ని పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్లు భూతగడ్డ సంపత్‌, తూముల సుభాష్‌లతో కలిసి సందర్శిం చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగా ణ పేరుతో అధికారంలోకి వచ్చి ఆకలిచావుల తెలంగాణ మార్చాడని శ్రీమాన్నారాయణ పేర్కొ న్నారు. రూ.1000 గౌరవ వేతనంతోని మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేయడం దురదృష్టక రమని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా వెయ్యి రుపాయల వేతనం ఇచ్చి పని చేయించుకోవడం లేదన్నారు. ధనిక తెలంగా ణలో దారిద్రపు బతుకులు బతుకుతున్న మహి ళ కార్మికుల వెతలు సీఎం కేసీఆర్‌ దృష్టిలో లేకపోవడం సాధించుకున్న తెలంగాణ దౌర్భా గ్యం అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టి నాయకత్వం లో మధ్యాహ్న భోజన సమస్యల వర్కర్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పూర్తి మద్దతు ఉంటుంద న్నారు. పెరిగిన వస్తుసేవల ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థికి పదిహేను రుపాయలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా మధ్యాహ్న భోజన వర్కర్‌ల సమస్య లను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళుతామన్నారు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అందరి సమస్యలను పరిష్కారం అయ్యే విధం గా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-27T06:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising