ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ABN, First Publish Date - 2021-10-20T05:03:36+05:30

మర్కజీ మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కరీంనగర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కరీంనగర్‌లో భారీ ర్యాలీ

కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 19: మర్కజీ మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనిపుర నుంచి ప్రారంభమైన ర్యాలీ కరీముల్లాషా దర్గాకు చేరింది. అక్కడ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీపీ సత్యనారాయణ, నగర ఏసీపి తుల శ్రీనివాస్‌ బందోబస్తు చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మర్కజీ మిలాప్‌ కమిటీ అధ్యక్షుడు ముఫ్తి అలీమొద్దీన్‌ నిజామీ బియాబానీ మాట్లాడుతూ మహమ్మద్‌ ప్రవక్త జీవితం యావత్‌ మానవాళికి మార్గదర్శకమని, ప్రవక్త చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు ఇర్ఫాన్‌ మొయినొద్దీన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌, సమద్‌నవాబ్‌, గులాం రబ్బానీ, ఫరీద్‌బాబా, మియాభాయ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌షమీ, హాజీ, నఖీబ్‌రజా, అజ్హార్‌దబీర్‌, అంజత్‌ఖాన్‌, ముజ్జు, కరీంఖాన్‌, అస్మత్‌అలీ, గౌసొద్దీన్‌ ఖాద్రి, వలీపాషా, సోహెల్‌రజా, హాజీభాయ్‌, మౌలానా నఖీబ్‌రజా, మౌలానా సయ్యద్‌షా, మొహమ్మద్‌ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising