ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా అధికారుల బదిలీల ప్రక్రియ

ABN, First Publish Date - 2021-12-30T05:59:34+05:30

కాళేశ్వరం జోన్‌ పరిధిలో అలాట్‌ అయిన అధికారుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌, కాళేశ్వరం జోన్‌ నోడల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

బదిలీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న నోడల్‌ ఆఫీసర్‌, సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాళేశ్వరం జోన్‌ నోడల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, డిసెంబరు 29: కాళేశ్వరం జోన్‌ పరిధిలో అలాట్‌ అయిన అధికారుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని రామగుండం పోలీస్‌ కమిషనర్‌, కాళేశ్వరం జోన్‌ నోడల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర జోన్‌ల నుంచి కాళేశ్వరం జోన్‌కు 472 మంది అధికారులు అలాట్‌ అయ్యారని, వారంతా తనకు రిపోర్టు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 111మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 116ఏఎస్‌ఐ, ఏఆర్‌ఏఎస్‌ఐలు, 245మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 471మంది కానిస్టేబుళ్లు బదిలీపై వచ్చారన్నారు. ఇతర జోన్ల నుంచి అలాట్‌ అయిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది సీనియార్టీ పరిగణలోకి తీసుకుంటూ కాళేశ్వరం జోన్‌ పరిధిలోని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అవకాశం మేరకు బదిలీలు చేయడం జరుగుతుందన్నారు. ఆయా జిల్లాల్లోని పోలీస్‌ స్టేష న్‌లలో టెక్నికల్‌ విభాగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా సిబ్బందిని బదిలీ చేస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. బదిలీ ప్రక్రియలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. 

Updated Date - 2021-12-30T05:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising