ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వచ్చాక లాభపడ్డది కేసీఆర్‌ కుటుంబమే

ABN, First Publish Date - 2021-10-20T05:05:05+05:30

తెలంగాణ వచ్చాక లాభపడ్డది కేసీఆర్‌ కుటుంబమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

హుజూరాబాద్‌ మండలం జూపాకలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత బట్టీ విక్రమార్క
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 19: తెలంగాణ వచ్చాక లాభపడ్డది కేసీఆర్‌ కుటుంబమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలంలోని జూపాక, కనుకులగిద్దె గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు లక్షల కోట్ల దోపిడీ చేస్తూ పదవులు అనుభవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నది టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలేనన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మీరు ఎక్కువ అంటే మీరు ఎక్కువ దోపిడీ చేశారని, వారు పంచుకున్న సొమ్ముతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. యువకుల ఉద్యోగాల కోసం కొట్లాడే విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేష్‌, కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మణ్‌కుమార్‌, అన్వేష్‌రెడ్డి, సురేఖ, కమలాకర్‌, మండల అధ్యక్షుడు కిరణ్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising