ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలి

ABN, First Publish Date - 2021-04-20T06:27:39+05:30

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించు కోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రైతులకు సూచించారు.

కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

ఓదెల, ఏప్రిల్‌ 19: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం  విక్రయించు కోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రైతులకు సూచించారు. మండల కేంద్రంలో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యతను పాటించి ధాన్యానికి మద్ధతు ధర పొందాలన్నారు. అనంతరం తూడి మధునయ్య, బుద్దె కుమార్‌ రైతులు మాట్లాడుతూ రైతులకు కేటాయించిన ధాన్యం కోనుగోలు కేంద్ర స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్ల ధాన్యం ఆరబోయడానికి తూకం వేయడానికి స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఐదేండ్ల నుండి హమాలిలకు డబ్బులు రావటం లేదని, దీంతో రైతులపై భారం పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఐరెడ్డి వెంకటరెడ్డి, పల్లెకుమార్‌, ఆళ్ల రాజిరెడ్డి, కావటి రాజు, తహశీల్దార్‌ రామ్మోహన్‌, అంజిరెడ్డి, లత మంగేశ్వరి, టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

- కాల్వశ్రీరాంపూర్‌: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వెన్నంపల్లి, మంగపేట, కాల్వ శ్రీరాంపూర్‌, పెగడపల్లి, మడిపల్లి, మడిపల్లికాలనీ, ఆశన్నపల్లి, అంకంపల్లి గ్రామాల్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌, జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఈ వేసవిలో ఎ మ్మెల్యే మనోహర్‌రెడ్డి కాల్వ శ్రీరాంపూర్‌ మండలం లో ఒక గుంట ఎండకుండా ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీరు ఒక వైపు హుస్సేన్‌మియా వాగులోకి, మరో వైపు డీ83, డీ86 కా లువల ద్వారా పంటలకు సరిపడా సాగునీరు అందిం చినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్‌ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవల్లి పురుషోత్తం, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ కొట్టె సుజాతరవి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నిదానపురం దేవయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-20T06:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising