ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది

ABN, First Publish Date - 2021-10-27T06:09:37+05:30

రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

వీణవంక మండలం మామిడాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

వీణవంక, అక్టోబరు 26: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని మామిడాలపల్లి, గొల్లపల్లి, ఎలబాక, ఘన్ముక్ల, మల్లన్నపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈటల రాజేందర్‌ తెలంగాణ ప్రభుత్వంపై అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. బండి సంజయ్‌ ఎంపీగా గెలిచి రెండేళ్లు దాటిందని, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటమి భయంతో బీజేపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. బలహీన వర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, లింగయ్య, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T06:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising