ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠదామాల నిర్మాణాలను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-03-07T06:03:30+05:30

వైకుంఠదామాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పంచాయతీ ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంపీడీవోలతో పల్లె ప్రగతి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శశాంక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, మార్చి6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వైకుంఠదామాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పంచాయతీ ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంపీడీవోలతో పల్లె ప్రగతి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 108 వైకుంఠదామాలు మంజూరు చేశామని, అందులో 49 పూర్తికాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన వైకుంఠదామాల పనున్నింటిని మార్చిలోగా పూర్తి చేయాలని, లేనిచో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, పంచాయతీ రాజ్‌ ఈఈ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 

మరమ్మతులకు అంచనాలు సమర్పించాలి

కరీంనగర్‌ టౌన్‌: కలెక్టరేట్‌లో గల టాయిలెట్‌ బ్లాక్‌ల మరమ్మతులకు వారం రోజుల్లో అంచనాల సమర్పించాలని  కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టరేట్‌ మరమ్మతుల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌లోని అన్నిటాయిలెట్‌ బ్లాక్‌లలో మరమ్మత్తులు పూర్తి చేసి రన్నింగ్‌ వాటర్‌, లైట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌ చుట్టూ విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలని అన్నారు. కలెక్టరేట్‌లో విద్యుత్‌ వైర్లు సరిగా లేవని, మొత్తం తనిఖీ చేసి తిరిగి వైరింగ్‌, ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయుటకు అంచనాలు సమర్పించాలని ఎస్‌ఈ ట్రాన్స్‌కోను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని క్యాంటీన్‌కు తగిన మరమ్మతులు చేసి కొత్త ఏజెన్సీకి అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, ఏనుగు నర్సింహారెడ్డి, డీఆర్‌వో వెంకట మాధవరావు, సీపీవో కొమురయ్య, ఫైర్‌ ఆఫీసర్‌ వెంకన్న, జిల్లా సంక్షేమాధికారి శారద డీఎస్‌వో సురేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-07T06:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising