ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్‌ డెయిరీని విస్తరించడం అభినందనీయం

ABN, First Publish Date - 2021-01-16T05:05:25+05:30

పాల సేకరణ, విక్రయాలకే పరిమితం కాకుండా కరీంనగర్‌ డెయిరీని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్రోల్‌ బంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

పెట్రోల్‌ పంపును ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 15: పాల సేకరణ, విక్రయాలకే పరిమితం కాకుండా కరీంనగర్‌ డెయిరీని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్రోల్‌ బంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం పద్మనగర్‌లోని డెయిరీ ఆవరణలో కరీంనగర్‌ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌రాజేశ్వర్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కరీంనగర్‌ డెయిరీ రూపొందించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజురోజుకు వ్యాపారాన్ని విస్తరిస్తూ దాదాపు 70వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, పాలకవర్గం కృషి ఎంతగానో ఉందని అన్నారు. కరీంనగర్‌ డెయిరీకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్‌, డిండిగాల మహేశ్‌, తోట రాములు, కాశెట్టి శ్రీనివాస్‌, డెయిరీ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising