బాల కార్మిక నిర్మూలన అందరి బాధ్యత
ABN, First Publish Date - 2021-06-12T06:55:46+05:30
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యతగా భావించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య అన్నారు.
- జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య
సిరిసిల్ల, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యతగా భావించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య అన్నారు. శుక్రవారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయంలో చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాను బాలల స్నేహ పూర్వక జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చే యాలని అన్నారు. పిల్లలు బడిలో పెద్దలు పనిలో ఉండాలన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య మా ట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాల ప్రకారం పిల్లలను పనిలో పెట్టుకుంటే 6 నెలల నుం చి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరు గుతుందన్నారు. బాలరక్ష భవన్ కో ఆర్డినేటర్ సుచ రిత మాట్లాడుతూ ఒంటరిగా బాధపడుతున్న బాల లను, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న బాల కార్మికు లను హింసకు, బెదిరింపులకు గురైనట్లు తెలిస్తే చైల్డ్ లైన్ 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వా లని సూచించారు. చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ త్రివేణి మాట్లాడు తూ చైల్డ్ లైన్ 1098 సేవలు జాతీయ స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. చైల్డ్ లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమం లో సీడబ్ల్యూసీ సభ్యులు పున్నం చందర్, ఖాజాన యూమోద్దీన్, డీసీపీవో స్వర్ణలత, లక్ష్మీనారాయణ, రమ్య, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - 2021-06-12T06:55:46+05:30 IST