ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండగట్టులో టెండర్లు వాయిదా

ABN, First Publish Date - 2021-07-27T06:04:20+05:30

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పరిధిలో పలు దుకాణాలకు అధికారులు నిర్వహించిన టెండర్లు వాయిదా పడ్డాయి.

కొండగట్టులో టెండర్లు నిర్వహిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫవేలంలో పాల్గొనని వ్యాపారులు

మల్యాల, జూలై 26: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పరిధిలో పలు దుకాణాలకు అధికారులు నిర్వహించిన టెండర్లు వాయిదా పడ్డాయి. సోమవారం కొబ్బరికాయల దుకాణం, గాజులు, ఆటవస్తువులు, పూలు, పండ్లు, పుట్నాలు, ప్యాలాలు, వంటచెరుకు విక్రయం, కిరా ణం, హోటల్‌, పాదరక్షలు, టెంట్‌హౌజ్‌ కొండ దిగువన గల షాపింగ్‌ కాంప్లెక్స్‌ లోని గదులకు ఏడాది కాలపరిమితికి గాను అధికారులు టెండర్ల నిర్వహించారు. గాజులు, ఆటవస్తువులు, ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయం ఒక్కదానికి మాత్రమే ముగ్గురు వేలంలో పాల్గొన్నారు. సుదగోని చిరంజీవి అనే వ్యక్తి రూ.15.70లక్షలు హెచ్చు పాట పాడగా క్రితం సారి రెండేళ్లకు రూ. 57.75లక్షలు ఉండగా సరైన పాట రానందున దాన్ని వాయిదా వేశారు. మిగతా వాటికి కూడా వ్యాపారులు వేలంలో ఒక్కరు కూడా పాల్గొనలేదు. దీంతో వాటిని కూడా వాయిదా వేశారు.  కొండ దిగువన గల దుకాణ సమూదాయంలోని ఏడు గదులకు టెండర్లు నిర్వహించగా అవి ఖరారు అయ్యాయి. మళ్లీ షార్ట్‌ టెండర్‌ నోటీస్‌ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసి టెండర్లు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశ్‌, ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, సునీల్‌ సర్పంచ్‌ బద్దం తిరుపతిరెడ్డి ఆలయ అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం తలనీలాల పోగుకు టెండర్లు నిర్వహించనున్నారు

ఫదుకాణాల మూసివేత..

ఈ ఏడాది మార్చితో ఆలయ పరిధిలోని దుకాణాల గడువు ముగియడంతో అధికారులు   దుకాణాల నిర్వహణకు గాను గత మార్చిలోనే టెండర్ల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.  వ్యాపా రులు హైకోర్టును అశ్రయించడంతో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దుకాణాల నిర్వహణ యధావిధిగా కొనసాగించుకునేలా చూడాలని, వ్యాపారుల బకాయిలలో 50శాతం వసూలు చేయాలని కోర్టు సూచించింది. కోర్టు ఇచ్చిన గడువు ముగియగా బకాయిలు కూడా పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో మూడు సార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు ఆయా దుకాణాలను మూసివేశారు. దీంతో సోమవారం దుకాణాలు తెరచుకోలేదు. ఆగస్టు నుంచి కొత్తగా దుకాణాల నిర్వహణకు అధికారులు సోమవారం నిర్వహించిన టెండర్లలో వ్యాపారులు పాల్గొననందున వాయిదా పడ్డాయి.


Updated Date - 2021-07-27T06:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising