పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కల్పించాలి
ABN, First Publish Date - 2021-02-02T05:48:47+05:30
పసుపు పంటను తవ్వుతున్న సమయం లో పంటకు మద్దతు ధర లేకపోవడం దురదృష్టకరమని జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు.
కలెక్టర్, ఎమ్మెల్యేలకు రైతు ఐక్యవేదిక నాయకుల వినతి
జగిత్యాల అర్బన్, జనవరి 1: పసుపు పంటను తవ్వుతున్న సమయం లో పంటకు మద్దతు ధర లేకపోవడం దురదృష్టకరమని జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జి ల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ ఎదుట మద్దతు ధర కల్పించాలని కో రుతూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంతో పాటు, ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. పసుపు పంట అమ్ముకునేందుకు మార్కెట్‌లో ధర లేనందున రాష్ట్ర ప్రభుత్వం బో నస్ ప్రకటించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పసుపు పం ట క్వింటాలుకు రూ.15000 మద్దతు ధర కోసం సిఫార్సు చేయాలని కో రా రు. ఈ కార్యక్రమంలో రైతు చైక్యవేదిక నాయకులు తదితరులున్నారు. ప సుపుపంట మద్దతు ధర విషయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం ఇ చ్చేందుకు వెళ్లిన రైతు ఐక్యవేదిక నాయకులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేక రాజకీయం చేసి బాండ్ పేపర్ రా సిచ్చిన వాళ్లకు ఓట్లు వేశారని ఎమ్మెల్యే అన్నారు.
Updated Date - 2021-02-02T05:48:47+05:30 IST