ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-10-29T06:04:52+05:30

బ్యాంకర్లు నిర్వహిస్తున్న రుణ మేళా కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్‌ గుగులోతు రవి పిలుపునిచ్చారు.

చెక్కులను అందిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కలెక్టర్‌ రవి 

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 28: బ్యాంకర్లు నిర్వహిస్తున్న రుణ మేళా కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్‌ గుగులోతు రవి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో  బ్యాంకర్లు నిర్వహించిన మెగా రుణ మేళా కార్యక్రమంలో పాల్గొని, లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో బ్యాంకుల పా త్ర కీలకం అన్నారు. జిల్లాలోని 20 బ్యాంకులకు సంబంధిం చి, 122 బ్రాంచులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తు న్నాయన్నారు. రుణ సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకా ల అమలు తీరు, బ్యాంకుల ప్రదర్శన వంటి అంశాలలో జి ల్లా బ్యాంకులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాయన్నారు. ఆ ర్థిక పునరుద్ధరణ, ప్రజల వద్దకు బ్యాంకింగ్‌ వ్యవస్థను తీ సుకెళ్లేందుకు క్రెడిట్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రాం(రుణ మేళా) కార్య క్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాహన కొ నుగోలు, ఇంటి నిర్మాణం, విద్యా, వ్యాపారం వంటి పలు ర కాల రుణాలు అందిస్తారని, రూ.10లక్షల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం అందిస్తామన్నారు. ప్రజలు తీ సుకున్న రుణాలను దుబారా చేయకుండా అవసరానికి మా త్రమే వినియోగించాలన్నారు. తీసుకున్న రుణాలను సకా లంలో సరైన విధంగా కిస్తీలు చెల్లించాలన్నారు. స్వశక్తి సం ఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, వాటిని చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు వినియోగించు కోవాలన్నారు. స్వశక్తి సంఘాలు పలు మోసాలకు పాల్పడు తూ అర్హత కంటే ఎక్కువ రుణాలు పొందడం, బ్యాంకులను మోసం చేయడం గుర్తించామని, అలాంటి సంఘాల నిర్వా హకులు తమ పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్‌ రవి హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారుల ఖాతాలకు బ్యాంకుల ద్వారా చేరుకుంటాయని, వీరు డిజి టల్‌ లావా దేవీలు చేసే విధంగా ప్రోత్సహించాలని, దీనికి సంబంధించి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రుణ మేళా కార్యక్రమంలో భాగంగా 1524 మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు సుమారు 100కోట్ల రూపాయల చెక్కులను కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ వెం కట్‌ రెడ్డి, యూబీఐ బ్యాంకు డీజీఎం అరుణ్‌ కుమార్‌, ఎస్‌ బీఐ బ్యాంకర్‌ ఆర్‌ఎం శ్రీనివాస్‌, ఏజీఎం సురేంధర్‌ నాయక్‌, టిజిబి బ్యాంక్‌ ఆర్‌ఎం గంగాధర్‌, సతీష్‌, కేడీసీసీ ఆర్‌ఎం రియాజ్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమ్య, అదనపు డీ ఆర్‌డీఏ సుధీర్‌కుమార్‌, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, మేనే జర్లు, ప్రతినిఽధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T06:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising