ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ర్కాప్‌ దొంగలపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-10-18T05:38:04+05:30

రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ర్కాప్‌ దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌కు వైఎస్‌ఆర్‌టీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ జిమ్మిబాబు ఫిర్యాదు చేశారు.

సీఐకి ఫిర్యాదు పత్రం అందజేస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌సిటీ, అక్టోబరు 17: రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ర్కాప్‌ దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌కు వైఎస్‌ఆర్‌టీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ జిమ్మిబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత ము న్సిపల్‌ కార్యాలయంలో రూ.70లక్షల విలువైన స్ర్కాప్‌ దొంగతనం జరిగి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇందులో కొంత మంది ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ పట్టిం చుకోవడం లేదన్నారు. కేవలం రూ.58 వేల స్ర్కాప్‌ పోయిందని కమిషనర్‌ ఫిర్యాదు చేయడం హస్యాస్పదంగా ఉందని, రూ.70లక్షల స్ర్కాప్‌ మాయమైతే ఇప్పటివరకు కమిషనర్‌ ఎందుకు సరిగా స్పందించడం లేదని, ప్రజాధనం వృధా అవుతున్నా చూ సీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఓ ప్రజాప్రతినిధి భర్తకు ఇందులో ప్రమేయం ఉందని తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేని ఆయన ప్రశ్నించారు. దీని పై త్వరలోనే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదులో చేసిన వారిలో నాయకులు ఓఎల్‌రెడ్డి, శ్యామ్‌సన్‌, రాజ్‌, ద బ్బెట మహేందర్‌, బూడిద బానేష్‌, వెంకటేష్‌, మహేందర్‌ ఉన్నారు. 

Updated Date - 2021-10-18T05:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising