ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింథటిక్‌ ట్రాక్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-02-25T05:39:42+05:30

నగరంలోని రీజ నల్‌ స్పోర్ట్స్‌స్కూల్‌కు మంజూరైన సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

మహిళా ప్రాంగణంలోని మిషనరీలను పరీశీలిస్తున్న కలెక్టర్‌ కె శశాంక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 24: నగరంలోని రీజ నల్‌ స్పోర్ట్స్‌స్కూల్‌కు మంజూరైన సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ట్రాక్‌ నిర్మాణపనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్‌ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ద్వారా 7కోట్లు మంజూర య్యాయని అన్నారు. ఇంతవరకు 3.5కోట్ల రూపా యలు విడుదల చేసినట్లు తెలిపారు. జరిగిన పను లకు సంబంధించి 2కోట్లకు నిధులు వినియోగ ధ్రువీకరణ పత్రం వెంటనే పంపించాలని అధికారు లను ఆదేశించారు. సివిల్‌పనులు మార్చిలోగా పూర్చి చేయాలని ఆదేశించారు. స్పోర్ట్స్‌స్కూల్‌ గ్రౌండ్‌లో గ్రాస్‌కట్టింగ్‌ మిషన్లు,వీడర్స్‌ సమకూర్చుకొని పకడ్బందీగా నిర్వహణ చేపట్టాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారిని ఆదే శించారు.


ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి


తిమ్మాపూర్‌: దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రం(మహిళ ప్రాంగణం)లో శిక్షణ తరగతులు ప్రారంభించేం దుకు వీలుగా తగిన కార్యచ రణ ప్రణాళికాలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ శశాంక అదేశించారు. బుధవారం ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. టైలరింగ్‌, బ్యూటీషన్‌, ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌, శానిటరీ న్యాప్కిన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విభాగాలలోని మిషన రీలను పరీశీలించారు. గతంలో నిర్వహిం చిన శిక్షణ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా ప్రాంగణంలో తిరిగి శిక్షణ తరగతులు ప్రారంభించుటకు వెంటనే తగిన అంచనా లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అదేశించారు. నగరపాలక సంస్ధ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, జిల్లా సంక్షేమాధికారి శారధ, ప్రాంగణం జిల్లా మేనేజర్‌ స్వరూప, తిమ్మాపూర్‌ మండల తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-25T05:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising