ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న దర్శనాల నిలిపివేత

ABN, First Publish Date - 2021-04-16T07:00:35+05:30

కరోనా మహమ్మారి ప్రభావం మరోసారి వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంపై పడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించవద్దని ఆలయ అధికారులు నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 18వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆంక్షలు

- అంతరంగికంగా సీతారాముల కల్యాణం

వేములవాడ, ఏప్రిల్‌ 15: కరోనా మహమ్మారి ప్రభావం మరోసారి వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంపై పడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించవద్దని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి సంకేపల్లి హరికిషన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. వేడుకకు సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు హాజరవుతుంటారు. ఈ నెల 21వ తేదీన రాజన్న క్షేత్రంలో సీతారాముల కల్యాణం నిర్వహించాల్సి ఉండగా, కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న తరుణంలో భక్తుల తాకిడిని నియంత్రించడం సాధ్యం కాదన్న అభిప్రాయంతో 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తులను శ్రీస్వామివారి దర్శనానికి అనుమతించవద్దని నిర్ణయించారు. కోడెమొక్కులు, అన్ని రకాల ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. ఈ క్రమంలో సీతారాముల కల్యాణం భక్తులు లేకుండా ఆలయం లోపల అంతరంగికంగా నిరాడంబరంగా నిర్వహించనున్నారు. మార్చి 31న నిర్వహించిన శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారల కల్యాణానికి భక్తులను అనుమతించకపోయినప్పటికీ వేలాది మంది ఆలయం వెలుపల గుమిగూడారు. ఫలితంగా వారిని నియంత్రించడం సాధ్యం కాలేదు. కొవిడ్‌-19 మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఇంత మంది భక్తులు ఎలా తరలివచ్చారని, భక్తులకు అనుమతి లేని విషయం ఎందుకు విస్తృతంగా ప్రచారం చేయలేదని కలెక్టర్‌తో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ రాజన్న ఆలయ అధికారులను వివరణ కోరారు. ఈ క్రమంలో సీతారాముల కల్యాణానికి మూడింతలు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారిని నియంత్రించేందుకు ఐదు రోజుల పాటు దర్శనాలను రద్దు చేశారు. భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా దర్శనం రద్దు నిర్ణయం తీసుకున్నామని, అందరూ సహకరించాలని ఆలయ ఏఈవో ఎస్‌.హరికిషన్‌ కోరారు.  కోడెమొక్కు, ఇతర ఆర్జిత సేవలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఇందుకోసం టీఎస్‌ మీసేవ లేదా టీ యాప్‌ ఫోలియో ద్వారా సేవల రుసుము చెల్లిస్తే గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - 2021-04-16T07:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising