ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-04-23T05:59:53+05:30

వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

రుద్రంగిలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఆది శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌

రుద్రంగి ఏప్రిల్‌ 22: వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం వడగళ్ల వర్షం కురవడంతో  దెబ్బతిన్న పంటలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారాన్ని అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసి ముద్దయిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో  డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి, కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, నాయకులు గడ్డం శ్రీనివాస్‌ రెడ్డి, తర్రె మనోహర్‌, మాడిశెట్టి అభిలాష్‌, గంధం మనోజ్‌, పూదరి మహిపాల్‌, పల్లికొండ వినయ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-23T05:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising