ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం

ABN, First Publish Date - 2021-01-25T06:03:14+05:30

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు.

మాట్లాడుతున్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హుజూరాబాద్‌ (సైదాపూర్‌), జనవరి 24: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆదివారం సైదాపూర్‌ మండలం వెన్నంపల్లిలో 33/11కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, వరంగల్‌ టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు విద్యుత్‌ కోసం రైతులు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేలాది కోట్లతో విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పారన్నారు. వినియోగదారులు బిల్లులు చెల్లిస్తేనే సంస్థ ముందుకు పోతుందన్నారు.  రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు పుష్కలంగా ఉంటాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమకు దిశ నిర్దేశం చేసి వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు సన్నహాలు చేయాలని ఆదేశించారన్నారు. విద్యుత్‌ వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులకు మొగ్గు చూపాలన్నారు. తెలంగాణ లో నిరంతరాయంగా విద్యుత్‌ ఇచ్చేందుకు భద్రాచలం, మణుగురు, భూపాలపల్లి, యాద్రాద్రి పవర్‌ ప్లాంట్ల సామర్థ్యం పెంచామన్నారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యుత్‌ వినియోగం పెరిగినట్లయితే ఈ సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంచుకునేందుకు సహకరించాలని సీఎండీని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో వరంగల్‌ టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా చైర్మన్‌ రామకృష్ణారావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రమ, సింగిల్‌ విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్లా వెంకట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు పద్మ-రవీందర్‌రెడ్డి, పాపయ్య, రాములు, రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సోమారపు రాజయ్య, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising