ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మకర సంక్రమణ వేళలో..

ABN, First Publish Date - 2021-01-13T04:56:48+05:30

నూతన క్రాంతి పథంలో పయనించేందుకు సంక్రాంతి పర్వదినం మన ముందుకు రాబోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతి సంబరం

తెలుగువారి ముచ్చటైన మూడురోజుల పండుగ

నేడు భోగి

కరీంనగర్‌ కల్చరల్‌/జగిత్యాల టౌన్‌, జనవరి 12: నూతన క్రాంతి పథంలో పయనించేందుకు సంక్రాంతి పర్వదినం మన ముందుకు రాబోతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతిగా ఆచరిస్తారు. ధనుర్మాసం పూర్తయి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుతిరిగే ఉత్తరాయణ పుణ్యకాలమే సంక్రాంతి. మార్గశిర, పుష్య మాసాల సంధికాలంలో హేమంత ఋతువులో వచ్చే ఈ పండుగ మూడు రోజుల జరుపుకుంటారు. తొలి రోజు భోగి మరునాడు సంక్రాంతి. ఆ తర్వాత రోజు కనుమ కాగా భోగి భాగ్యానికి, సంక్రాంతి సంపదకు, కనుమ కలిమికి చిహ్నం. 13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ పండుగలను జరుపుకోనున్నారు.

భోగ్యమైన భోగి..

భోగికి పది రోజుల ముందు నుంచే భోగి పిడుకలుపెట్టి మధ్యలోరంధ్రం చేసి హారంగా తయారు చేస్తారు. పాతకు పాతర వేయడంలో భాగంగా పిడుకల హారంతోపాటు ఇంట్లోని నిరుపయోగ వస్తువులు, పాత సామానులు భోగి మంటల్లో వేస్తారు. అవి కాలగా వచ్చిన విభూతి ధరిస్తారు. చిన్న పిల్లలకు రేగుపళ్లు, రాగి నాణేలు, చెరుకు ముక్కలు, నువ్వులు, పిండి వంటలు కల్పి తలపై నుంచి జారే విధంగా భోగి పళ్లు పోస్తారు. గోదాదేవి శ్రీకృష్ణుడిని ఆరాధించి రంగనాఽథుడిని పరిణయమాడి భోగమనుభవించిన రోజు కాబట్టి భోగి పండుగ  జరుపుకుంటారు.

పుణ్యప్రద సంక్రమణం..

సంక్రాంతి లక్ష్మి ఆగమనానికి సంకేతం. శ్రీమన్నారాయణుడితో కలిసి లక్ష్మీదేవి రంగురంగుల ముగ్గుల రథాన్నెక్కి వస్తుందంటారు. ఈ రోజు ముగ్గులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. లక్ష్మితో పాటు సంక్రాంతి పురుషుడు, బలి చక్రవర్తి ఇంటికి వచ్చి శుభాలనిస్తారనే భావనతో ప్రతి ఇంటిని ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు పెడతారు. పసుపు కుంకుమలతో గొబ్బెమ్మలను తయారు చేసి కూరపిండి ఆకు, రేగుపళ్లు, నువ్వులు పెట్టి ముగ్గులో ఉంచుతారు. సకల సౌభాగ్యాలు కలగాలని పిండి వంటలు చేసి పితృ దేవతలకు నివేదన చేసి తాము తింటారు.  సాయంత్రం పిల్లలు గాలి పటాలనెగరేస్తూ విశాల విశ్వంలో తామొక్కరే అన్నట్లుగా ఊహల్లో తేలిపోతారు. మహిళలు, యువతులు నోములు పంచుకొని వాయినాలు ఇచ్చుకొని పెద్దల  ఆశీస్సులు పొందుతారు.

రైతుల పండుగ కనుమ

సంక్రాంతి మరుసటి రోజు నిర్వహించే కనుమ రైతులకు సంబంధించిన పండుగ. సంవత్సరమంతా తమతో కష్టపడిన పశువులను పూజించడంలో భాగంగా ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి ముద్దుగా ముస్తాబు చే స్తారు. గిట్టలను కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పశువుల శాలలను పేడతో అలిగి ముగ్గులు పెట్టి పొంగలి వండి పాలు పొంగిస్తారు. సాయంత్రం పశువులను సంరక్షించమని గ్రామ, పొలిమేర దేవతలకు బలి సమర్పిస్తారు. కోడి పందాలు, ఎద్దుల పందాలు, వివిధ క్రీడలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. 

Updated Date - 2021-01-13T04:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising