ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లు విక్రయానికి.. ‘గౌడ్‌సాబ్‌’ యాప్‌

ABN, First Publish Date - 2021-10-15T07:22:48+05:30

ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అందుబాటులో ఉంది. ఇందుకోసం వివిధ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన గౌడ సంఘం యువకులు వినూత్న ఆలోచన చేశారు. కల్లు విక్రయాలకు గౌడ్‌సాబ్‌ యాప్‌ను రూపొందించారు.

కొలనూర్‌లో యాప్‌ అవిష్కరిస్త్ను యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అందుబాటులో ఉంది.  ఇందుకోసం వివిధ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన గౌడ సంఘం యువకులు వినూత్న ఆలోచన చేశారు. కల్లు విక్రయాలకు గౌడ్‌సాబ్‌ యాప్‌ను రూపొందించారు. గురువారం కొలనూర్‌లో యాప్‌ను విడుదల చేశారు. గీత కార్మికులు గీసిన కల్లు కొన్ని సార్లు అమ్ముడుపోకపోవడం, మరికొన్ని సార్లు వినియోగదారుడు గీత కార్మికుని వద్దకు వచ్చేసరికి కల్లు అయిపోయిందనే సమాచారం వస్తుండడంతో కార్మికులకు, వినియోగదారులకు సమన్వయకర్తగా ఉండే విధంగా గౌడ్‌సాబ్‌ యాప్‌ను రూపొందించారు. ఇందులో ఏ కార్మికుని వద్ద ఎంత కల్లు ఉందో వివరాలను అప్‌లోడ్‌ చేయడం దానికి అనుగుణంగా వినియోగదారుడు బుక్‌ చేసుకుంటే కల్లు మండువా (దుకాణం) వద్ద సిద్ధంగా ఉంచే వీలు కలుగుతుంది. యాప్‌ను వివేక్‌గౌడ్‌, చరణ్‌గౌడ్‌లు ఆలోచన చేశారు. కొలనూర్‌ గౌడ సంఘం అధ్యక్షుడు బూరుగు రామచంద్రం, ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్‌, కోశాధి కారి నేరేళ్ల సురేష్‌, బుర్ర పవన్‌గౌడ్‌, గ్రామస్థులు యాప్‌ను ఆవిష్కరించారు. 

Updated Date - 2021-10-15T07:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising