ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-04-13T05:38:10+05:30

గ్రామాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు.

మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలో మాస్కు లేకుండా తిరుగుతున్న యువకుడికి ఫైన్‌ విధించాలని సూచిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల కలెక్టర్‌ రవి

మెట్‌పల్లి రూరల్‌, ఏప్రిల్‌ 12 : గ్రామాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని కొండ్రికర్ల గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్‌ పర్యటించారు. పాజిటివ్‌ వచ్చిన వారు బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ వైద్యుల సూచనలు పా టించాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను ఇంటి వద్దకు పంచాయతీ సిబ్బందితో పంపించాలన్నారు. గ్రామంలో జరిగిన జాత రలో పాల్గొన్న వారిని గుర్తించి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని మండల వైద్యాధికారి నరేందర్‌కు సూచించారు. ప్రతిరోజు పారిశుధ్య పనులను చేపట్టాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. కలెక్టర్‌ పర్యటిస్తు న్న సమయంలో మాస్కు లేకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్న బద్దం రమణకు రూ.వెయ్యి జరిమానా  విధిం చాలని కార్యదర్శి హేమలతకి ఆదేశించారు. ఈయన వెంట డీఎంహెచ్‌వో శ్రీధర్‌, డీపీవో పల్లికొండ నరేశ్‌, ఎంపీడీవో గున్నాల కల్పన, ఏపీవో తిరుపతిరావు, సర్పం చ్‌ ఆకుల రాజగంగు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising