ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం పెంచాలి

ABN, First Publish Date - 2021-10-21T05:53:09+05:30

జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ఆధారంగా నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో మ రింత వేగం పెంచాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశిం చారు.

వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ఆధారంగా నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో మ రింత వేగం పెంచాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశిం చారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి స్పెషల్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌, మె గా పల్లె ప్రకృతి వనాలు, మల్టీ లెవల్‌ ఎవెన్యూ ప్లానిటేషన్‌, ఇతర ప్రగతి పనుల పు రోగతి నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, ఆర్డీఓలు, ప్రత్యేకా ధికారులతో బుధవారం జూమ్‌ యాప్‌ ద్వారా వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. బతుకమ్మ, దసరా పండుగల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం కానున్న తరుణంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. పండుగల సందర్భంగా జిల్లాలో ఆశించిన మేర మున్సిపల్‌, గ్రామ స్థాయిలో కొవి డ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ జరగడం లేదన్నారు. ఓటరు జాబితా ఆధారంగా చివరి వ్యక్తి వరకు వ్యాక్సినేషన్‌ అందేలా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో అధికారులు ప్రత్యేక దృష్టితో కృషి చేయా లన్నారు. మల్టిలెవల్‌ ప్లానిటేషన్‌ నిర్వహణ సక్రమంగా జరగడం లేద ని, కొన్ని ప్రాంతాల్లో మొక్కలు సరిగా లేకపోవడం, ట్రీ గార్డులు లేక పోవడం వంటివి గుర్తించామన్నారు. అసంపూర్తిగా ఉన్న వైకంఠదా మాల నిర్మాణాలను పూర్తి చేయాలని, వాటికి సంబంధించిన బిల్లుల ను అప్‌లోడ్‌ చేయాలన్నారు. డంపింగ్‌ యార్డు పనులు పూర్తి చేయా లని, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు దాదాపుగా స్థలాలను కేటా యిం చి, పెద్ద ఎత్తున మొక్కలు నాటే పనులు పూర్తి చేస్తామన్నారు. కొన్ని చోట్ల స్థలాల గుర్తింపులో ఇబ్బందులు తలెత్తితే వాటిపై చర్యలు తీసు కునేలా అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువు రు అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T05:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising