ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2021-12-01T05:37:07+05:30

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరతగతిన పరిష్కరించాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులకు సూచిం చారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  డీజీపీ మహేందర్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, నవంబరు 30: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరతగతిన పరిష్కరించాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులకు సూచిం చారు. మంగళవారం జిల్లా ఎస్పీలు, వివిధ స్థాయి పోలీస్‌ అఽధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరి స్తూ, వాటి సంఖ్యను తగ్గించాలన్నారు. సాంకేతకను పూర్తిస్థాయిలో వినియో గించు కొని  నేరాలపై మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించి, నేర స్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. డ్రగ్స్‌, గంజాయి సరఫరాదారులపై నిఘా వేసి, వారి కదలికలను గమనించాలన్నారు. సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు ఎస్పీ రూపేష్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ రాఘవేంద్రరావు, ఎస్‌బీ, ఐటీకోర్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌లు శ్రీనివాస్‌, సరిలాల్‌, దుర్గ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-01T05:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising