ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2021-06-23T05:59:57+05:30

జిల్లాలో రహదారికిరువైపుల మూడు వరుసలలో మొక్కలను నాటి పచ్చదనంతో కూడిన హరిత జిల్లాగా మార్చాలని కలె క్టర్‌ రవి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

మల్యాల మండలం రాజారంలో గుంతలు పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫరహదారికి ఇరువైపుల మూడు వరుసల్లో మొక్కలు నాటాలి

ఫకలెక్టర్‌ జి.రవి 

మల్యాల, జూన్‌ 22: జిల్లాలో రహదారికిరువైపుల మూడు వరుసలలో మొక్కలను నాటి పచ్చదనంతో కూడిన హరిత జిల్లాగా మార్చాలని కలె క్టర్‌ రవి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలోని రాజారం నుంచి దొంగలమర్రి వరకు నూకపెల్లి, రామన్నపేట, ముత్యం పేట పరిధిలోని రహదారికిరువైపుల ఉపాధి కూలీలు చేపట్టిన మొక్కలు నాటేందుకు తవ్వుతున్న గుంతల పనులను పరిశీలించారు. పలు సూచ నలు చేశారు. రాజారం, రామన్నపేట, నూకపెల్లి గ్రామాల పరిధిలో గుం తల తవ్వకాన్ని వేగవంతం చేయలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా రహదారికి కొంత దూ రంలో మొక్కలు నాటాలని, గతంలో నాటిన మొక్కల మద్య దూరం ఎ క్కువ లేకుండా మొక్కల పరిమాణాన్ని బట్టి గుంతలను ఏర్పాటు చేసి పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. రోడ్డును ఆనుకొని పేరుకుపో యిన గడ్డి, చెత్తను బ్లెడ్‌ ట్రాక్టర్లు ఎక్కువ లోతుగా కాకుండా వాటిని మా త్రమే తొలగించేలా చూడలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్డీఏ పీడీ వినోద్‌ కుమార్‌, ఎంపీడీవో శైలజారాణీ, ఎంపీవో వాసవి ఈజీఎస్‌ ఏపీవో శ్రీని వాస్‌, ఈసీ మనోజ్‌ సర్పంచ్‌లు ఎడిపెల్లి సుగుణఅశోక్‌, బద్దం తిరుప తిరెడ్డి పంచాయితీ కార్యదర్శులు ఉన్నారు.

రోడ్డుకు ఇరువైపుల మొక్కలను పెంచాలి

కొడిమ్యాల : రోడ్డుకు ఇరువైపుల పచ్చదనంతో కూడిన మొక్కలను పెంచాలని కలెక్టర్‌ రవి అన్నారు. మంగళవారం మండలంలోని దొంగల మర్రి, నాచుపెల్లి, పూడూర్‌, తురుకకాశీనగర్‌ వరకు రోడ్డుకు ఇరు వైపు ల ఉపాధిహామీ కూలీల ద్వారా మొక్కలు నాటడానికి తవ్వుతున్న గుంత లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వైపు ఉన్న మొక్కలను ఆయన పరిశీలించారు. వాహనాదారులకు ఇబ్బం దులు కలుగకుండా రోడ్డుకు కొంత దూరంలో మొక్కలు నాటాలన్నారు. గతంలో నాటిన మొక్కలు వంగిపోవటం, ట్రీగార్డ్సు సరిగా లేనట్లయితె వాటిని సరిచేయాలన్నారు. ఏడవ విడుత నాటాలిసిన మొక్కల వివరాల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వినోద్‌కుమార్‌, ఎం పీడీవో పద్మజరాణి ఎంపీవో గంగాధర్‌, ఏపీవో రమాపతి, నాచుపెల్లి స ర్పంచ్‌ లతతిర్మలేష్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T05:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising