ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2021-07-28T05:44:38+05:30

మండలంలోని మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకున్న రాజన్నపేటను కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని రాజన్నపేటలో ‘మదాద్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ చేపట్టారు.

పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, జూలై 27: మండలంలోని మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకున్న రాజన్నపేటను కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని రాజన్నపేటలో ‘మదాద్‌’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ చేపట్టారు. టీకా పంపిణీ తీరును జిల్లా వైద్యాధికారి సుమన్‌మోన్‌రావు పరిశీలించారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. టీకా పంపిణీకి మదాద్‌ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామంలో 170 మందికి రెండో డోసు, 30 మందికి మొదటి డోసు టీకా వేశామన్నారు. మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్‌ శంకర్‌, వైద్యాధికారి ధర్మానాయక్‌,  స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బలరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising