ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి

ABN, First Publish Date - 2021-11-27T06:13:14+05:30

జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తరువాత నోడల్‌ అఽధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని, ఎప్ప టికప్పుడు నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 26: జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తరువాత నోడల్‌ అఽధికారులు  క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని, ఎప్ప టికప్పుడు నివేదిక సమర్పించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం  పౌరసరఫరాలు, రవాణా శాఖ అఽధికారులు, నోడల్‌ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 41 మంది వీఆర్వోలకు నోడల్‌ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే సమాచారం అందించాలన్నారు. ట్రాక్‌ షీట్‌ అన్‌లైన్‌ జనరేషన్‌, రైతుల పేమెంట్‌ చెల్లింపులపై దృష్టి సారించాలన్నారు. సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్‌ హరికృష్ణ, డీటీవో కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T06:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising