ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెర్ప్‌ మహిళల ఆర్థిక సాధికారత

ABN, First Publish Date - 2021-08-01T05:53:53+05:30

మహిళలు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు మహిళా సంఘాల ద్వారా నాణ్యమైన సహజ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

కట్టె గానుగ నూనెను తయారు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జోరుగా నాణ్యమైన సహజ ఉత్పత్తుల విక్రయాలు

- జిల్లాలో 2,476 యూనిట్ల లక్ష్యం

జగిత్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు మహిళా సంఘాల ద్వారా నాణ్యమైన సహజ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీటిని సహజ బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో విని యోగదారులకు అందిస్తున్నారు. తాజాగా కల్తీలేని నూనెను అరికట్టేందు కు కట్టె గానుగ యంత్రాన్ని జిల్లాలోని జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీ పూర్‌ గ్రామంలో ఏర్పాటు చేశారు. మహిళలకు అందిస్తున్న రుణాలతో స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు, ప్రజాప్రతినిఽధులు ప్రత్యేక దృ ష్టి సారించారు. ఇందులో స్థానికంగా ఉన్న వనరుల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేసి సహజ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌ చేసేలా మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌లు పథకాన్ని రూపకల్పన చేశారు.

వివిధ రకాల వస్తువుల ఉత్పత్తులు....

జిల్లాలోని జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో పసుపు తయారీ యూనిట్‌ను సెర్ఫ్‌ మహిళలచే ప్రారంభింప జేశారు. కల్లెడలో వ్యవసా య పనిముట్లను అద్దెకిచ్చేలా యూనిట్‌ను నెలకొల్పారు. జాబితాపూర్‌లో పిండి, ధరూర్‌లో హోంఫుడ్‌ తయారు చేసి విక్రయిస్తున్నారు. ధరూర్‌ గ్రామంలో మెహందీ తయారీ చేస్తున్నారు. జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లో మినీ రైస్‌ మిల్లు, పెళ్లి క్యాపులను తయారు చేస్తున్నారు. ఇ లా జిల్లా వ్యాప్తంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా లబ్దిపొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2,476 యూనిట్లు....

జిల్లా వ్యాప్తంగా సెర్ప్‌ అధికారులు మహిళ సంఘాల ద్వారా వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు కల్తీలేని నూనెల ను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం రుణాలు ఇచ్చి మహిళల ను ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు, 380 గ్రామ పం చాయతీల్లో 2,476 స్వయం ఉపాధి యూనిట్ల టార్గెట్‌ విధించగా ఇప్పటి వరకు 1,448 యూనిట్లను మహిళలకు మంజూరు చేసి వారి ద్వారా నా ణ్యమైన సహజ ఉత్పత్తులతో పేరుతో పలు రకాల యూనిట్లను మహిళ లు నెలకొల్పారు. వీరు ఆర్థికంగా లభ్ది పొందడమే కాకుండా సహజ బ్రాండ్‌ పేరుతో నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు.


వినియోగదారుల కళ్లెదుటే...

కల్తీలేకుండా వినియోగదారులకు అందించేందుకు నువ్వులు, పల్లీలను వినియోగదారుల ముందే గానుగలో పోసి నూనె తయారు చేసి ఇస్తు న్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కట్టెగాను నూనె యూనిట్లను ఏర్పాటు చే సి వాటి ద్వారా వినియోగదారుల ముందే నూనె తీసి ఇవ్వడంతో నాణ్య మైనది తీసుకువెళ్తున్నారు, కల్తీ నూనెలకు చెక్‌ పెట్టే విధంగా మహిళలు తయారు చేస్తున్న కట్టెగానుగ స్వచ్చంగా ఉండడంతో వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్‌ కంటే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ విని యోగదారులు సహజ బ్రాండ్‌ ఉత్పత్తులపై మక్కువ చూపుతున్నారు.

జిల్లాలో మరిన్ని సహజ బ్రాండ్‌ యూనిట్లు...

- వెంకటేశ్‌, సెర్ఫ్‌ డీపీఎం, జగిత్యాల

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా యూనిట్లను ఏర్పాటు చేస్తు న్నాం. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన యూనిట్లను సహజ బ్రాండ్‌ పేరు తో మార్కెట్‌ చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా చాలా యూనిట్లు ఏర్పా టు చేసేందుకు మహిళలను ప్రోత్సహిస్తున్నాం. మరిన్ని యూనిట్లు ఏ ర్పాటు చేస్తే మహిళలు ఆర్థికంగా నిల దొక్కుకుంటారు.

Updated Date - 2021-08-01T05:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising