ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు కోట్ల కమీషన్ల కోసమే ఎస్‌సీ సబ్‌ప్లాన్‌ ప్యాకేజీ

ABN, First Publish Date - 2021-02-25T05:36:45+05:30

రామగుండం నగరపాలక సంస్థలో రూ.9.8కోట్ల పనులను రూ.2 కోట్ల కమీషన్‌కు అమ్ముకుంటున్నారని రామగుండం కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కొలిపాక సుజాత ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కార్పొరేటర్ల ఆరోపణ

కోల్‌సిటీ, ఫిబ్రవరి 24: రామగుండం నగరపాలక సంస్థలో రూ.9.8కోట్ల పనులను రూ.2 కోట్ల కమీషన్‌కు అమ్ముకుంటున్నారని రామగుండం కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్‌, కొలిపాక సుజాత ఆరోపించారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.స్థానిక ఎమ్మెల్యే, మేయర్‌ ఈ ప్యాకేజీని తయారుచేసి కమీషన్‌ దండుకునే కార్యక్రమాన్ని చేపట్టారని ఆరో పించారు. గతంలో సీఎంఏ గ్రాంట్‌ పనులను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలకుకమీ షన్లకు కక్కుర్తిపడి అప్పగించారని, 5శాతం అదనపు రేటుపై పనులు తీసుకుని కూడా మూడేళ్లుగా కాంట్రాక్టర్లు పనులు చేయడంలేదన్నారు. రూ.15కోట్ల పనులు పొందిన ము న్సిపల్‌ కాంట్రాక్టర్లు 20శాతం మేర తక్కువ రేటుపై టెండర్లు పొంది ఆరునెలల్లో పనులు పూర్తిచేశారన్నారు. ఇప్పుడు కూడా ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు చెందిన 43పనులను దొడ్డిదారిన ఒకే ప్యాకేజీగా మార్చి బడా కాంట్రాక్టర్లకు అమ్ముకుని 15నుంచి 20 శాతం కమీషన్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మేయర్‌, మున్సిపల్‌కమిషనర్‌, ఇంజనీరింగ్‌ విభాగంలో ఒక అధికారి ఇందులో సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. కార్పొరేషన్‌ మేయర్‌ సారథ్యంలో పూర్తిగా అవినీతి మయమైందన్నారు. చివరికి కరోనా మరణాలపై కూడా కమీషన్లు దండుకుంటున్నారన్నారు. కార్పొరేషన్‌లో కమీషన్ల కోసం టెండర్ల వ్యవహారంలో కొత్త దందాకు తెరతీశారని,ఇతర కాంట్రాక్టర్లు భాగస్వామ్యులు కాకుం డా షరతులు పెడుతున్నారన్నారు. ఇలాంటి సుమారు 20 పనులు ఇటీవల కాలంలో అధికారులు,మేయర్‌ కుమ్మక్కై అప్పగించారన్నారు. కార్పొరేషన్‌లో 30 పనులను అమ్ముకుని డబ్బులు వసూలు చేశారని, కౌన్సిల్‌ ఆమోదంలేకుండా డబ్బులు దం డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రామగుండం నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతికి ఐఏఎస్‌ అధికారి అయిన కమిషనర్‌ బాధ్యత వహించాల ని వారు డిమాండ్‌చేశారు. దీనిపై ఆయన స్పందించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ముస్తఫా, పెద్దెల్లి తేజస్వి ని, గాదం విజయ, సనా ఫకృద్దీ న్‌, ముదాం శ్రీను, నగునూరి సుమలత పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising