ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ప్రాణాలను కాపాడండి

ABN, First Publish Date - 2021-05-07T06:50:54+05:30

కరోనా ఉధృ తం అవుతోందని ప్రజల ప్రాణా లను కాపాడాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ చార్జి ఆది శ్రీనివాస్‌ సూచించారు.

మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ 

చందుర్తి, మే 6: కరోనా ఉధృ తం అవుతోందని ప్రజల ప్రాణా లను కాపాడాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ చార్జి ఆది శ్రీనివాస్‌ సూచించారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కరోనా తో మృతి చెందిన మృతుల కు టుంబాలను గురువారం పరామ ర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టులు కరోనా కట్టడిపై తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరి కలు జారీ చేసినప్పటికీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ లాక్‌డౌన్‌ అవసరం లేదని చెప్పడం  విడ్డూరంగా ఉందన్నారు. కరోనా వ్యాధితో మృతి చెందిన కుటుం బాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్‌ దొరకక ప్రైవేటు ఆసు పత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీ కింద బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ నాగం కుమార్‌,  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వా మి, నాయకులు గొట్టె ప్రభాకర్‌, పులి సత్తయ్య, మర్రి మల్లేశం, మల్లారపు రాజయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-07T06:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising