ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-01-13T04:52:43+05:30

రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ కన్వీనర్‌ భూంపల్లి రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ కన్వీనర్‌ రాఘవరెడ్డి

కరీంనగర్‌ టౌన్‌ / రూరల్‌, జనవరి 12: రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ కన్వీనర్‌ భూంపల్లి రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని వీపార్క్‌ హోటల్‌లో ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.... అగ్రకుల పేదలకు విద్యా, ఉద్యోగాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం కల్పించి న పది శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోరాటాలకు స్పందించిన కేంద్రం రాజ్యంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించిందన్నారు. రెండు సంవత్సరాలుగా రిజర్వేషన్లు అమలు చేయక పోవడంతో 70 వేల మంది అగ్రకుల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కొన్ని వర్గాలకు ఉన్న 22 శాతం రిజర్వేషన్లను స్వార్థ రాజకీయాలతో ఓటు బ్యాంకు రాజకీయాలతో 50 శాతం వరకు పెంచి 70 సంవత్సరాలుగా అనేక రంగాల్లో రిజర్వేషన్లు అమలు పరుస్తుండడంతో ప్రతిభావంతులైన అగ్రకుల పేద విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల సాధనకోసం ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ఓసి మహాగర్జనకు పార్టీలు, కులాలు, సంఘాలకతీతంగా ఓసీ  సామాజిక వర్గీయులందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంది తిరుపతిరెడ్డి, అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, మానేరు విద్యాసంస్థల అధినేత అనంతరెడ్డి, నాయకులు ఉచ్చిడి మోహన్‌రెడ్డి, బుస్స శ్రీనివాస్‌, మహిపాల్‌రెడ్డి, బండగో పాల్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, మూల ప్రభాకర్‌రెడ్డి, పింగిలి రవీందర్‌రెడ్డి, పద్మాకర్‌రెడ్డి, చేపురి అశోక్‌, గంగాధర్‌, మనోహర్‌రెడ్డి రాధారెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అంజయ్య, సత్యనారా యణ, రామచందర్‌రెడ్డి, నాగరాజు, రవీందర్‌రెడ్డి, బాపురెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T04:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising