ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం

ABN, First Publish Date - 2021-10-29T05:30:00+05:30

జిల్లాలో వానాకాలం వరిధా న్యం కొనుగోళ్లకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గత సీజన్‌ లో మాదిరిగానే పల్లె పల్లెన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్ల ను సేకరించడానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో వరి సాగు

- 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

జగిత్యాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం వరిధా న్యం కొనుగోళ్లకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గత సీజన్‌ లో మాదిరిగానే పల్లె పల్లెన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్ల ను సేకరించడానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. పండిం చిన ప్రతీ గింజను కొంటామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేప థ్యంలో అధికారులు ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని చర్యలు తీసు కుంటున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణను నెలాఖరులోపు ప్రారంభించ డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేడ్‌ - ఏ ధాన్యానికి రూ. 1,960, కామ న్‌ ధాన్యానికి రూ. 1,940 మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. గత యాసంగి సీజన్‌లో ఏ - గ్రేడ్‌ రకానికి 1,888, బీ - గ్రేడ్‌ రకానికి 1,860 ధరను సర్కారు అందించింది. గతంలో కంటే ప్రస్తుత సీజన్‌లో మద్దతు ధరను సర్కారు పెంచింది.

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

జగిత్యాల జిల్లా పరిధిలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 2.93 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం ఎ క్కువగా ఉంది. అక్కడక్కడ సన్న రకం సాగు చేసారు. ఇందుకు గాను జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అం చనా ఉంది. ధాన్యం సేకరించడానికి అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. గత సీజన్‌లో ఎదురైన ఇబ్బందులను పరిగణలో కి తీసుకొని ప్రస్తుత సీజన్‌లో సమస్యలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త లు వహిస్తున్నారు. కేంద్రాల ప్రారంభం నుంచి ధాన్యం రైస్‌ మిల్లులు, గోదాములకు చేరే వరకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమ లు చేయడానికి సమాయత్తం అవుతున్నారు.

జిల్లాలో 391 కొనుగోలు కేంద్రాలు...

జిల్లాలో వరి ధాన్యం సేకరించడానికి 391 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ తరపున 157 కొనుగోలు కేంద్రాలు, ప్రా థమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల తరపున 227, వ్యవసా య మార్కెట్‌ కమిటీల తరపున 7 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని బీర్పూర్‌ మండలంలో 14, బుగ్గారంలో 8, ధర్మపురిలో 8, గొ ల్లపల్లిలో 26, కోరుట్లలో 30, మల్యాలలో 21, మల్లాపూర్‌లో 26, మేడిప ల్లిలో 31, ఇబ్రహీంపట్నంలో 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా రు. జగిత్యాల రూరల్‌ మండలంలో 31, జగిత్యాల అర్బన్‌ మండలంలో 6, కథలాపూర్‌లో 24, కొడిమ్యాలలో 23, మెట్‌పల్లిలో 24, పెగడపల్లిలో 28, రాయికల్‌లో 32, సారంగాపూర్‌లో 23, వెల్గటూరులో 25 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు. ప్రతీ కొనుగో లు కేంద్రానికి డిప్యూటీ తహసీల్ధార్‌ హోదా గల అధికారిని ఇన్‌చార్జీగా నియమించారు. 

టోకెన్‌ సిస్టంలో కొనుగోళ్లు...

ధాన్యం సేకరణలో అధికారులు టోకెన్‌ సిస్టం అమలు చేయనున్నారు. రైతులు ధాన్యాన్ని తమ పొలాల వద్ద, ఇంటి వద్ద శుభ్ర పరుచుకొని తా లు, తప్ప, పెళ్ల, ఇతర వ్యర్థాలు లేకుండా నాణ్యమైన సెంటర్లకు తీసుకొని రావాలని సూచిస్తున్నారు. సెంటర్‌ ఇన్‌చార్జీలు ధాన్యం తెచ్చిన రైతులకు ముందుగా టోకెన్లు జారీ చేసి క్రమ పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు చేయ నున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు దృవీకరించిన ధాన్యాన్ని సెంట ర్‌ ఇన్‌చార్జీలు కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఒకే వి ధమైన హమాలీ చార్జీలు అమలు చేస్తున్నారు. 

కేంద్రాల్లో మౌలిక వసతులు..

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులకు, సిబ్బందికి అవసర మైన మౌలిక వసతులను అధికారులు సమకూరుస్తున్నారు. ప్రతీ కేంద్రం లో ఎలక్ర్టానిక్‌ కాంటా, ధాన్యం శుద్ది యంత్రం, విద్యుత్‌ వసతి, ఆన్‌లైన్‌ వసతి, ట్యాబ్స్‌, ప్రింటర్స్‌, పవర్‌ పాయింట్స్‌, పేపర్‌ రోల్స్‌, సిమ్స్‌, టార్ఫా లిన్‌ కవర్లు, గన్నీ బ్యాగులు, తాగునీరు, నీడ, టాయిలెట్స్‌ తదితర సౌక ర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించారు. సెంటర్‌ ఇన్‌చార్జీలు రైతు వివరాలు నమోదు చేసే సమయంలో పంట భూమి వివరాలు,  ఆ ధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌ నంబరులను ఓపీఎం ఎస్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 80 లక్షల గన్నీ సంచుల ను అందుబాటులో ఉంచారు. సుమారు 4 వేల టార్పాలిన్‌కవర్లు, 550 తూకం మిషన్లు అవసరమని గుర్తించారు.

కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలుపై దృష్టి...

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్‌ -19 నిబంధనలు పక్కాగా అ మలు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. మాస్కులు ధరించ డం, భౌతిక దూరం పాటించడం, సానిటైజర్లు వినియోగించడం వంటివి చేయనున్నారు. కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి అనుగు ణంగా తగిన నీరు, సబ్బు అందుబాటులో ఉంచడం వంటివి చేస్తున్నారు.


కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు

- చందన్‌ కుమార్‌, జిల్లా సివిల్‌ సప్లయి అధికారి, జగిత్యాల

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లకు అవస రమైన ఏర్పాట్లను పక్కాగా చేస్తున్నాము. కలెక్టర్‌ గుగులోతు రవి నాయ క్‌ ఆదేశాల మేరకు అవసరమైన సెంటర్లను గుర్తించి, మౌలిక వసతులు కల్పిస్తున్నాము. చివరి గింజ వరకు మద్దతు ధర అందించి కొనుగోలు చేస్తాము. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి  అధికారు లకు సహకరించాలి.

Updated Date - 2021-10-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising