ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది టీఆర్ఎస్ విజయం కాదు.. నా విజయం: రవీందర్ సింగ్

ABN, First Publish Date - 2021-12-14T16:20:08+05:30

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనను పోటీలో నిలువకుండా టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందన్నారు. ఇక్కడ గంగుల కమలాకర్ మంత్రిలా వ్యవహరించలేదని విమర్శించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఈసీకి ఇచ్చానన్నారు. ఇక్కడ టీఆర్ఎస్‌ది విజయం కాదని... తన విజయమని రవీందర్ సింగ్ అన్నారు. ఎందుకంటే.. తన నామినేషన్ ఫారమ్‌ను తిరస్కరించే ప్రయత్నం చేశారని.. అయినా తాను పోటీలో ఉన్నానని ఇది తన మొదటి విజయమన్నారు. తాను విత్ డ్రా కాకపోవడం రెండో విజయమన్నారు. 11 వందల మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు 18 రోజులు భోజనం, అన్నిరకాల వసతులు కల్పించానని, ఇంకొక గొప్ప విజయం ఏంటంటే.. ఎలా ఓటు వేస్తారన్నది ఎంపీటీసీలకు తన ద్వారా తెలిసిందని.. ఇవన్నీ తన విజయాలేనని రవీందర్ సింగ్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-12-14T16:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising