ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీటి కోసం రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-04-13T06:13:04+05:30

గంభీరావుపేట మండల కేంద్రానికి సమీపాన ఉన్న పెద్ద కాలువ ఆయకట్టు రైతులు సోమవారం సాగునీటి కోసం రాస్తారోకో చేపట్టారు.

గంభీరావుపేటలో రాస్తారోకో చేస్తున్న రైతులు, బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంభీరావుపేట, ఏప్రిల్‌ 12: గంభీరావుపేట మండల కేంద్రానికి సమీపాన ఉన్న పెద్ద కాలువ ఆయకట్టు రైతులు సోమవారం సాగునీటి కోసం రాస్తారోకో చేపట్టారు. సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైటాయించారు. ఎగువ మానేరు నుంచి పెద్ద కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. సాగునీరు అందక పెద్ద కాలువ కింద ఉన్న పొన్నాలపల్లె, గంభీరావుపేట, లక్ష్మిపూర్‌ ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుసార్లు సంభందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీటిని విడుదల చేస్తామని, పెద్ద కాలువను శుభ్రం చేసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు.  30 వేల వరకు ఖర్చుచేసి, కాలువను శుభ్రం చేసుకున్నామని, అధికారులు  సాగునీరు ఇవ్వడం లేదని రైతులు అన్నారు.  ఇప్పటికే సాగునీరు అందక సగానికి పైగా పంటలు ఎండిపోయాయని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే మిగితా పంట కూడ ఎండి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో రాపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏఎస్సై తిరుపతి ఆఽధ్వర్యంలో పోలీస్‌లు అక్కడికి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఇరిగేషన్‌ ఏఈ   మానేరు నుంచి పెద్ద కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 

Updated Date - 2021-04-13T06:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising