ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-09-18T06:25:18+05:30

జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పిం చాలని, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు క్షేత్ర స్థాయి లో ప్రచారం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశిం చారు.

కలెక్టరేట్‌లో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పిం చాలని, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు క్షేత్ర స్థాయి లో ప్రచారం చేయాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశిం చారు. శుక్రవారం సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, మండల వ్యవసాయ అఽధికారులతో యాసంగిలో పంటల మార్పిడిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని రైతులు పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి పంటలు సాగు చేసేలా అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఉద్యాన  పంటల సాగుతో వచ్చే లాభాలను వివరించాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమన్వయంతో గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యవసాయధికారి రణధీర్‌రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారి షాబొద్దీన్‌ పాల్గొన్నారు. 

 రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌: జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ధరణి, మీసేవ దరఖాస్తులతోపాటు రెవెన్యూ సమస్యలను వారం రోజుల్లో  పరిష్కరించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల  కలెక్టరేట్‌లో శుక్రవారం  తహసీ ల్దార్‌లతో వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.  ఽ పరిష్కారం చూపడంలో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.సమావేశంలో పర్యవేక్షకులు రవికాంత్‌, సుజాత, సిరిసిల్ల తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఈడీఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-18T06:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising