ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సమష్టిగా పని చేయాలి

ABN, First Publish Date - 2021-08-01T05:31:15+05:30

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్ర జాప్రతినిధులు నిర్విరామంగా కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి  

- ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్ష సమావేశం

ఓదెల, జూలై 31 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్ర జాప్రతినిధులు నిర్విరామంగా కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో శనివారం సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్య క్షులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌లు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం నాయకుల భాగస్వామ్యంతో హరితగ్రామం తయా రుకావాలన్నారు. గ్రామాలన్నీ శుభ్రంగా రూపుదిద్దుకునేందుకు నాయకులు, ము ఖ్యభూమిక పోషించాలని, ఇందుకోసం ప్రతి శుక్రవారం స్వచ్ఛతను పాటించాల ని కోరారు. అలాగే మండలంతో పాటు గ్రామాల్లో నాయకులు నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని ఇప్పటినుండే క్షేత్రస్థాయిలో పటిష్ట పరుచుకోవాలని కోరారు. మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వంపై గాని, టీఆర్‌ఎస్‌ నేతల పట్లగాని ఆరోపణలు వచ్చినపుడు ఎలాంటి కక్షలు లేకుండా సమష్టిగా స్పందించాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు కావటి రాజు, వైస్‌ఎంపీపీ పల్లె కుమార్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-01T05:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising