ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ కోసం ప్రజా ధనాన్ని వృథా చేశారు

ABN, First Publish Date - 2021-05-24T06:15:40+05:30

మిషన్‌ భగీరథ నీటి కోసం ప్రజా ధనాన్ని వృథా చేయడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్పుడు ప్లాన్లు ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

ఫిల్టర్‌ బెడ్లవద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సింహులపల్లిలో భగీరథ నీరు రాకున్నా వస్తున్నట్లు రికార్డులు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

బీర్‌పూర్‌,మే 23: మిషన్‌ భగీరథ నీటి కోసం ప్రజా ధనాన్ని వృథా చేయడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్పుడు ప్లాన్లు ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌ మాజీ సర్పంచ్‌ దన్నపనేని లక్ష్మన్‌ రావ్‌(ప్రథాప్‌ రావ్‌)సంతాప సభకు ముఖ్య అధితిగా హజరయ్యరు. అనంతరం బీర్‌పూర్‌ మండల కేంద్రం లోని ఫిల్టర్‌ బెడ్లను పరిశీలించారు. గత వారం రోజులుగా తుంగూర్‌, బీర్‌పూర్‌ గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు రావడంలేదని తెలుసుకున్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ వృథా ప్రయస అన్నారు. భగీరథ నీరు ఫిల్టర్‌ అవుతున్న డబ్బా గ్రామం నుంచి కేవలం 30 కిలో మీటర్ల వరకే శుద్ధ నీరుగా ఉంటుందని, తరువార మాములు నీరుగానే మారిపోతుందన్నారు. కాంట్రాక్టర్లకు లాభాలు సమకూర్చేవిధంగా సీఎంకు ప్లాన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి శా శ్వతంగా తాగు నీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. గ్రామానికి నీటి సరఫరా చే యకున్నా సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో రాసి ఉంచడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. భవిష్యత్‌లో ఎమ్మెల్సీ నిధుల ద్వారా బీర్‌పూర్‌ ఫిల్టర్‌ బెడ్‌ను మళ్లీ పున: ప్రారంభం చేసి మండలంలోని 15 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ మసర్తి రమేష్‌, జడ్పీటీసీ పాత పద్మ రమేష్‌, వైస్‌ ఎంపీపీ బల్మురి లక్ష్మన్‌ రావ్‌, కొల్వాయి సింగిలివిండో చేర్మేన్‌ పొలుసాని నవీన్‌ రావ్‌, సర్పంచ్‌ గుడిసె శ్రీమతి జితేందర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ సారంగాపూర్‌ మండల అధ్యక్షులు కోండ్రా రాంచంధ్ర రెడ్డి, బీర్‌పూర్‌ మండల అధ్యక్షులు చెరుపూరి సుభాష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-05-24T06:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising