ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యులపై దాడికి నిరసన

ABN, First Publish Date - 2021-04-18T05:26:52+05:30

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట శనివారం తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

జగిత్యాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 17 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట శనివారం తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌  ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌రెడ్డి, అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు నవీన్‌, శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైద్యులపై దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైద్యులకు రక్షణ చట్టాన్ని అమలు చేయా లని ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల యూనిట్‌ వైద్యులు ఉన్నారు.

వెల్గటూర్‌లో...

వెల్గటూర్‌ :  కొత్తగూడెం ఏరియా అసుపత్రి వైద్యాధికారి, వైద్యారోగ్య శాఖ సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య అని వైద్యాధికారులు డా. రమేష్‌, డా. కిరణ్‌కుమార్‌ అన్నారు. శనివారం వెల్గటూర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising