ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపల్లి రైల్వే జంక్షన్‌లో సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-12-04T05:52:56+05:30

పెద్దపల్లి రైల్వే జంక్షన్‌లో నెలకొన్న సమ స్యలను పరిష్కరించి, పలు రైళ్లను నిలపాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యా ల ప్రదీప్‌ కుమార్‌ రైల్వే బోర్డు ప్రయాణీకుల సంఘం చైర్మన్‌ రమేష్‌ రతన్‌ను కోరారు.

రమేష్‌ రతన్‌కు వినతిపత్రం ఇస్తున్న దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌

పెద్దపల్లి, డిసెంబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి రైల్వే జంక్షన్‌లో నెలకొన్న సమ స్యలను పరిష్కరించి, పలు రైళ్లను నిలపాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యా ల ప్రదీప్‌ కుమార్‌ రైల్వే బోర్డు ప్రయాణీకుల సంఘం చైర్మన్‌ రమేష్‌ రతన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో చైర్మన్‌ను కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. కాజీపేట్‌- బల్లార్షా, పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌ వరకు గల రైల్వే మార్గాల్లోని రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఈ మార్గాల్లో నూతన రైళ్ల పొడిగింపులు, వివిధ రైల్వే స్టేషన్లలో ఆపవలసిన రైళ్లను నిలపాలని కోరారు. కరోనా కంటే ముందు నడిచిన రైళ్లను తిరిగి పునరుద్ధరించా లని, పెద్దపల్లి జంక్షన్‌లో లిఫ్టు సౌకర్యాన్ని కల్పించాలని, జంక్షన్‌ను ఉన్నతీకరించా లని, ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను నిలపాలని కోరారు. గతంలో కరోనా కంటే ముందు దక్షిణ్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలును తిరిగి పెద్దపల్లిలో నిలపాలని కోరారు. నిజామాబాద్‌ నుంచి కాజీపేట వరకు ఒక పుష్‌ ఫుల్‌ రైలు వయా పెద్ద పల్లి మీదుగా నడపాలని, ఆదిలాబాద్‌ నుంచి కాజీపేట వరకు వయా బల్లార్షా, పెద్దపల్లి మీదుగా ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించాలన్నారు. వీటితో పాటు తిరుపతి- కరీంనగర్‌ రైలును బాసర వరకు పొడిగించాలని, తిరుపతి- సికిం ద్రాబాద్‌ సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు పొడిగించాలని పేర్కొన్నారు. దీనితో పాటు విశాఖపట్నం నుంచి షిర్డీ మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ రైలును వయా కాజీపేట టౌన్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లిం చాలని కోరారు. అలాగే పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో నవజీవన్‌, జైపూర్‌-మైసూర్‌, రాయ పూర్‌- సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను నిలపాలని కోరారు. 

Updated Date - 2021-12-04T05:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising