ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని అరికట్టండి

ABN, First Publish Date - 2021-12-06T05:54:11+05:30

వరిధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల జిల్లాలో రైతుల రాస్తారోకో

మల్లాపూర్‌, డిసెంబరు 5 : వరిధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకుల దోపిడీని అరికట్టాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు తాలు, తప్ప పేరిట 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోల ధాన్యం ఎక్కువగా తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపులోనూ, కొనుగోళ్లలోనూ జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్‌, అధికారులు రావాలని, తమకు వివరణ ఇవ్వాలని రైతులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవీందర్‌, సొసైటీ చైర్మన్‌ నర్సారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లతో మాట్లాడి ఇబ్బందులు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

Updated Date - 2021-12-06T05:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising