సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
ABN, First Publish Date - 2021-11-09T05:32:31+05:30
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
సుభాష్‌నగర్, నవంబరు 8: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాం తాలకు చెందిన 110 మంది నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పరిష్కరిం చడానికి సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యంతో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్‌కుమార్, మున్సి పల్ కమిషనర్ యాదగిరిరావు, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, ఎక్సైజ్ సూపరిం టెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో జువేరియా, డీపీవో వీరబుచ్చయ్య, డీసీవో శ్రీమాల, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, ఎల్‌డీఎం లక్ష్మణ్, అధికారులు పాల్గొన్నారు.
దూరప్రాంతాల వారి సౌలభ్యానికే డయల్ యువర్ కలెక్టర్
దూరప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజా సమస్యలు పెండింగ్‌లో పెట్టకుండా వెంట వెంటనే పరిష్కరిం చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
బాలల హక్కుల వారోత్సవాలను విజయవంతం చేయాలి..
ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న బాలల హక్కుల వారో త్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారి బి రవీందర్ బాలల హక్కుల వారో త్సవాల కార్యక్రమాల గురించి వివరించారు. 8న గర్భిణులకు సే ఎస్ టు గర్ల్ చైల్డ్, బేటీ బచావో.. బేటీ పడావోపై ఎస్‌ఎంఎస్ సందేశాల పంపిణీ, 9న కేజీబీవీ, చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్స్‌లో ఉన్న పిల్లలకు ఆటల పోటీలు ఉంటాయని తెలి పారు. 10న కేజీబీవీ, సీసీఐ పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా హెల్త్ చెకప్ కార్య క్రమం ఉంటుందని, 11, 12 తేదీల్లో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీ లు, బాలల హక్కులపై పీసీ-పీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఉం టాయన్నారు. 13న మారథాన్ వాక్ తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహిస్తామన్నారు. అనంతర జిల్లాస్థాయి సమావేశం, సంతకాల సేకరణ, సాం స్కృతిక కార్యక్రమాలు, బహుమతి పంపిణీ, కరోనాతో మరణించిన కుటుంబాల పిల్లలకు బాల సహాయ కిట్స్ పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
Updated Date - 2021-11-09T05:32:31+05:30 IST