ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో పరిశ్రమలకు అనుమతులను ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-02-25T05:32:20+05:30

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ అధి కారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ అధి కారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమలకు అందించే ప్రోత్సా హం అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న పరిశ్రమ ప్రోత్సాహక కమిటీ ద్వారా జిల్లాలో ఏర్పాటుచేయనున్న పరిశ్రమలకు వివిధ శాఖల ద్వారా జారీ చే యాల్సిన అనుమతుల్లో పెండింగ్‌ వాటిని పరిశీలించి సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించా రు. పెద్దపల్లి జిల్లాను ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కలెక్టర్‌ సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శంకర్‌కుమార్‌, పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌, పరిశ్రమల శాఖ సంయుక్త సంచాల కులు మధుకర్‌బాబు, ప్రాంతీయ రవాణా అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising