ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-11-26T06:38:44+05:30

నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సింధు శర్మ సూచించా రు.

మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల టౌన్‌, నవంబరు 25: నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సింధు శర్మ సూచించా రు. గురువారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ సైబర్‌ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. గుట్కా రవాణా, గంజాయి, పేకాట, ఇసుక అక్రమ రవాణా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవా లని ఆదేశాలు జారీచేశారు. పెండింగ్‌ కేసుల విషయంలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాల న్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీ షీట్స్‌ తెర వాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి రోజూ డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్‌ చాలన్ల పై ప్రత్యేక దృష్టి పెట్టి రెండు కంటే ఎక్కువ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్‌ చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రూపేష్‌ కుమార్‌, డీఎస్పీలు ప్రకాష్‌, రవీం దర్‌రెడ్డి, రాఘవేంద్ర రావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-11-26T06:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising