ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర

ABN, First Publish Date - 2021-12-09T06:54:09+05:30

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించేందుకే ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తోందని పెగడపల్లి మండల ప్రత్యేకాధికారి భిక్షపతి పేర్కొన్నారు.

గ్రామపంచాయతీలో పల్లెనిద్ర కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్న ప్రత్యేకాధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెగడపల్లి,డిసెంబరు 8 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించేందుకే ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తోందని పెగడపల్లి మండల ప్రత్యేకాధికారి భిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని బతికెపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమంలో ఎంపీడీఓ పుల్లయ్య పలువురు మండల అధికారులతో కలసి గ్రామపంచాయతీలో నిద్రించారు. బుదవారం ఉదయం అధికారులతో కలసి గ్రామంలోని వీధులన్నీ తిరిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్‌పై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. తాగునీటి సమస్య, పారిశుధ్య నిర్వహణ, కరోనా వ్యాక్సినేషన్‌ వందశాతం తదితర అంశాలపై పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చి వాటిని  విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తాటిపర్తి శోభారాణి, ఎంపీడీఓ పుల్లయ్య, ఎంపీఓ మహేందర్‌, వైద్యాధికారి సుధాకర్‌,  పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, ఏఎన్‌ఎం సంధ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising